MediaWiki:Prefswitch-main/te

From translatewiki.net
వికీపీడియా కొత్త మార్గదర్శకం యొక్క తెరపట్టు (పెద్ద చిత్రం)
పుట దిద్దుబాటు అంతవర్తి యొక్క తెరపట్టు (పెద్ద చిత్రం)
లంకెలను చేర్చడానికై కొత్త సంవాద పేటిక యొక్క తెరపట్టు

వికీని మీకు సులభతరం చేయడానికి వికీమీడియా ఫౌండేషను యొక్క User Experience జట్టు సమాజంలోని ఇతర ఔత్సాహికులతో కలిసి పనిచేస్తూంది. కొత్త రూపురేఖలు మరియు సరళీకృత దిద్దుబాటు సౌలభ్యాలతో కూడిన కొన్ని మెరుగులను మీతో పంచుకోడానికి ఆనందిస్తున్నాం. గత సంవత్సరం మేం నిర్వహించిన ఉపయోగ్యతా పరీక్షలపై ఆధారపడిన ఈ మార్పులు కొత్త వాడుకరులు తేలికగా మొదలుపెట్టడానికి ఉద్దేశించినవి. మా ప్రాజెక్టుల ఉపయోగ్యతని మెరుగుపరచడం అన్నది వికీమీడియా ఫౌండేషను యొక్క ఒక ప్రాధాన్యత మరియు భవిష్యత్తులో మేం మరిన్ని తాజాకరణలని అందిస్తాం. మరిన్ని వివరాలకై, సంబంధిత వికీమీడియా బ్లాగు టపాని చూడండి.

ఇవీ మేం మార్చినవి

  • మార్గదర్శకం: పుటలని చదవడానికి మరియు మార్చడానికి మార్గదర్శకాన్ని మెరుగుపరిచాం. ఇప్పుడు, పుటలకి పైన ఉండే ట్యాబులు మీరు పుటలో ఉన్నారా లేదా చర్చా పుటలో ఉన్నారా, మరియు పుటని చదువుతున్నారా లేదా మారుస్తున్నారా అన్న విషయాన్ని మరింత స్పష్టంగా చూపిస్తాయి.
  • దిద్దుబాటు పనిముట్ల పట్టీకి మెరుగులు: మరింత తేలికగా ఉపయోగించడానికి గానూ దిట్టుబాటు పనిముట్ల పట్టీని మేం పునర్వవస్థీకరించాం. ఇప్పుడు, పుటలని రూపుదిద్దడం తేలిక మరియు సహజం.
  • లంకెల విజార్డ్: ఇతర వికీ పుటలకు మరియు బయటి సైట్లకి లంకెలు చేర్చడానికి తేలికైన పనిముట్టు.
  • అన్వేషణ మెరుగులు: మీరు వెతుకుతున్న పుటలకి తొందరగా చేరుకునేందుకు గానూ మేం అన్వేషణ సూచనలని మెరుగుపరిచాం.
  • ఇతర కొత్త సౌలభ్యాలు: పట్టికలని సృష్టించడాన్ని సులభతరం చేయానికి ఒక పట్టికల విజార్డ్ మరియు పుటల దిద్దుబాటుని సరళం చేయడానికి వెతుకు మరియు మార్చు సౌలభ్యాన్ని కూడా ప్రవేశపెట్టాం.
  • వికీపీడియా చిహ్నం: మా చిహ్నాన్ని తాజాకరించాం. వికీమీడియా బ్లాగులో మరింత చదవండి.