ప్రతిపాదనలు
వీవెన్ గారూ,
తెవికి లో తెలుగు అంకెల నిషేదానికి లేదా ఆంగ్ల అంకెల వాడకానికి ఏదైనా ప్రతిపాదనలు గతంలో చోటుచేసుకుని ఉనాయ?
తెవికి లో తెలుగు అంకెల వాడుకంపై మీ అనుభవాలు మరియు అభిప్రాయాలూ చేపగలరని ఆశిస్తున్నాను.
ట్రాన్స్‌లేట్‌వికీ అనువాదాలపై మీరు ఇచిన సూచనలకు చాల దన్యవాదాలు.
నాకు తెలిసి మొదటి నుండీ అరబిక్ అంకెలనే తెవికిలో ఉపయోగిస్తున్నాం, తెలుగు అంకెలు ఉపయోగించాలన్న ప్రతిపాదనలేవీ రాలేదు. తెవికీలో తెలుగు అంకెలు ఉపయోగించాలని మీరు లేవనెత్తిన చర్చని చూసాను.
నా మట్టుకు నాకు తెలుగు అంకెలు రావు (వ్రాయలేను), ఇంతకు మునుపు చూడటమే కానీ నేర్చుకోలేదు, కష్టంతో ఒక్కో అంకెనీ గుర్తించాల్సిందే. అరబిక్ అంకెలకే నా ఓటు. ఇక హిందీ తమిళాల్లో ఆయా అంకెలు నిజ జీవితంలోనూ వాడుకలో ఉన్నాయి కదా. తెలుగు నాట ఆర్టీసీ బస్సులపై తప్ప బయట ఎక్కడా తెలుగు అంకెలు కనిపించవు.
మీ తతిమా అనువాదాలను తగ్గట్టు మార్చారా?