Jump to content

పేరెన్నిక కు మెరుగైన పదం

పేరెన్నిక కు మెరుగైన పదం

సూచనలలో పేరెన్నిక అంత వాడుకలో వున్న పదంలా లేదు. మిమ్మల్ని తలచారు అంటే ఎలావుంటుంది. Arjunaraoc (talk) 03:08, 15 October 2013 (UTC)

Arjunaraoc (talk)03:08, 15 October 2013

మిమ్మల్ని ప్రస్తావించారు అన్నది ఇంకా ఎక్కువ వాడుకలో ఉంది. కానీ ఇదే పదానికి నామవాచకం చెప్పలేం! అందువలన పేరెన్నిక ఎందుకొచ్చిందో అర్థం చేసుకోగలరు.

రహ్మానుద్దీన్ (talk)10:47, 21 November 2013

తలంపు, ప్రస్తావింపు సరిపోతాయనుకుంటాను.

Arjunaraoc (talk)10:48, 12 December 2013

ప్రతి పదానికీ నామవాచక రూపం, క్రియా రూపం ఉంటాయి. పేర్కొనడానికి క్రియగా పేరెన్నిక అని రాసాను. ఇది పేర్కొనడం అనే వాడవచ్చు. తలంపు అన్నపుడు తలుచుకున్నారు అన్నది క్రియ అవుతుంది. అలానే ప్రస్తావనకు ప్రస్తావింపు అవుతుంది. పేర్కొన్నారు అని వాడాలి అనుకుంటే, పేరెన్నిక లేదా పేర్కొనడం వాడదాం, లేదా మొతం అనువాదం మార్చాలి. ప్రస్తావన పెద్ద పదమవుతుంది, దానికి వేరే అర్ధాలూ ఉన్నాయి.

రహ్మానుద్దీన్ (talk)10:53, 12 December 2013

ఇది ప్రస్తుతం శీర్షికలాగా మాత్రమే వాడబడుతున్నందున ప్రస్తావన/ప్రస్తావనలు సరిపోతుంది అనుకుంటున్నాను. సూచనలవ్యవస్థ సందర్భంలో ఇంకో అర్ధం నాకు తట్టటంలేదు. పేరెన్నిక నాకు ఎందుకు నచ్చలేదు అంటే విశిష్టగుర్తింపు అన్న అర్ధం అనిపిస్తుంది. (గూగుల్ ఫలితాలు చూడండి.

Arjunaraoc (talk)11:03, 12 December 2013